సైకిల్‌పై మంత్రి పయనం.. అడ్డుకున్న పోలీసులు








చెన్నై,టీ.నగర్‌: పుదుచ్చేరి సరిహద్దులో సైకిల్‌పై ప్రయాణిస్తున్న మంత్రిని శనివారం తమిళనాడు పోలీసులు అడ్డుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించారు. ఇతర రాష్ట్రాల ప్రజలను, వాహనాలను అనుమతించడం లేదు. ఇలావుండగా శనివారం పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాది కృష్ణారావు సైకిల్‌పై వెళ్లి తనిఖీలు ప్రారంభించారు. ఆయన ఇందిరాగాంధీ విగ్రహం, రాజీవ్‌గాంధీ విగ్రహం దాటుకుని కోరిమేడుకు వెళ్లారు. రాష్ట్ర సరిహద్దు అయిన ఆ ప్రాంతానికి సైకిల్‌పై ట్రాక్‌ సూట్, టీ.షర్టుతో వచ్చిన ఆయన్ను తమిళనాడు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మల్లాది కృష్ణారావు తను పుదుచ్చేరి మంత్రిగా పరిచయం చేసుకోవడంతో పంపివేశారు.